ఒంగోలు నగరం మీదుగా ఇంకొల్లు వరకు చాలా ఏళ్ల క్రితమే హైటెన్షన్ విద్యుత్ లైను ఏర్పాటుచేశారు. కాలక్రమంలో విద్యుత్ లైనుకు రెండువైపులా భవనాలు వెలిశాయి. అలా విస్తరిస్తూ రావడంతో విద్యుత్ లైను ఇప్పుడు నగరం నడిబొడ్డుకు చేరింది. కొన్నాళ్లుగా కరెంటు తీగలు కిందికి జారిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. రాజీవ్‌నగర్, నిర్మల్‌నగర్, అంజయ్య రోడ్డు, బృందావన్ నగర్, వీఐపీ రోడ్డు, బాలకృష్ణాపురంలో... ఇప్పటివరకు 30మంది వరకు విద్యుదాఘాతానికి బలయ్యారు.
హైటెన్షన్ విద్యుత్ లైను మార్చాలన్న ప్రజల డిమాండ్ మేరకు... ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్యలు చేపట్టారు. 56.74 కోట్ల అంచనాతో భూగర్భ కేబుల్ పనులకు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. అయితే నెలలు గడుస్తున్నా పనులు మొదలవకపోవడంతో... గాలులు వీచినప్పుడు, వర్షాలు పడినప్పుడు ప్రజలు భయం భయంగానే కాలం గడుపుతున్నారు. భూగర్భ కేబుల్ పనులు నాలుగు నెలల్లో పూర్తిచేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: