ప్రకాశం జిల్లా పర్చూరులోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా పర్చూరు ఇంఛార్జ్ రావిరామనాధం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని..అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సబ్సిడిపై వ్యవసాయ పనిముట్లను ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎ.ఓ ఫాతిమా పాల్గొన్నారు.
ఇదీ చదవండి