ETV Bharat / state

పెద్దల వివాదం...పాఠశాలకు విద్యార్థులు దూరం - school

గ్రామపెద్దల మధ్య తగాదాతో ప్రకాశం జిల్లా రామచంద్రాపురంలోని విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. ఓ కుటుంబానికి చెందిన పిల్లలు పాఠశాలకు రావద్దని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే ఆ పిల్లలు స్కూల్​కు రావటంతో గ్రామస్తులంతా వారి పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.

పెద్దల వివాదం...విద్యార్థులు స్కూలుకు దూరం
author img

By

Published : Sep 7, 2019, 5:32 PM IST

పెద్దల వివాదం...విద్యార్థులు స్కూలుకు దూరం

పెద్దల వివాదం పిల్లలకు శాపంగా మారింది. గ్రామ పెద్దల నడుమ నెలకొన్న వివాదం 60 మంది చిన్నారులను బడికి వెళ్ళనీయకుండా చేసిన ఘటన ప్రకాశం జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. మాజీ ఎంపీటీసీ, వైకాపా నాయకుడు కోడూరు వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దల మధ్య భూవిషయంలో 3 నెలల క్రితం వివాదం మొదలైంది. తనను ఊరి నుంచి అకారణంగా బయటకు పంపేశారంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు... జులై 22న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశాడు. తర్వాత అధికారులు గ్రామానికి వెళ్లి పెద్దలకు నచ్చజెప్పి... ఆగస్టు 28న బాధితుడిని గ్రామానికి పంపారు. అయితే 2రోజుల క్రితం గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. వెంకటేశ్వర్లు మనవళ్లు..ముగ్గురు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారు బడికి వస్తే మా పిల్లలను స్కూలుకు పంపమంటూ గ్రామ పెద్దలు ప్రధానోపాధ్యాయుడిని హెచ్చరించి... పిల్లలను పాఠశాల నుంచి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఇవాళ వెంకటేశ్వర్లు మనవళ్లు ముగ్గురు తప్ప స్కూలుకు ఎవరూ హాజరుకాలేదని పేర్కొన్నారు.

ఇవీ చూడండి-ఈ బడి మూతపడి మూడేళ్లయ్యింది.. తెరిచేదెన్నడో!

Intro:AP_RJY_86_05_TDP_Nayukudu_RJY_AVB_AP10023
ETV Bharat:Satyanarayana(RJY CITY)
East Godavari

( ) తూర్పు గోదావరి జిల్లా లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా ఆయన జిల్లాకు వచ్చారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పాటు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి , రాజమహేంద్రవరం అర్బన్ ఆదిరెడ్డి భవాని, రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నాయకులు చంద్రబాబు కు ఘన స్వాగతం పలికారు నేరుగా అక్కడినుంచే కాకినాడ చేరుకున్నారు.

Body:AP_RJY_86_05_TDP_Nayukudu_RJY_AVB_AP10023

Conclusion:AP_RJY_86_05_TDP_Nayukudu_RJY_AVB_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.