కరోనా పాజిటివ్ కేసు కారణంగా ప్రకాశం జిల్లా పర్చూరును కంటైన్మెంట్ జోన్లొకి మార్చారు. చెన్నైలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ... ఇటీవల స్వగ్రామానికి వచ్చిన పర్చూరువాసికి పాజిటివ్ నిర్దరణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పర్చూరును కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
ఆ కానిస్టేబుల్ ఈనెల 7న ఇంటికి రాగా... స్థానికుల సమాచారం మేరకు అధికారులు 8న ఇంకొల్లులోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల్లో కరోనా నిర్ధరణ అయింది. అతనితో సన్నిహితంగా మెలిగిన 12 మందిని ప్రథమ కాంటాక్ట్‌గా గుర్తించారు. వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.