ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఒంగోలు నుంచి పర్చూరు వస్తోన్న ఆర్టీసీ బస్సు... ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇంకొల్లు మండలం వంకాయలపాడు చెందిన తిరుపతి నరసింహారావు(28), గుంజి శ్రీను((19)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి : కాసేపట్లో ముఖ్యమంత్రితో సీఎస్ సమావేశం