ప్రకాశం జిల్లా కురిచేడులో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు వీధుల్లో పడేశారు. నరసరావుపేటలో తెదేపా నేత కోడెల కుటుంబం ఎలా అరాచకాలు చేసిందో దర్శిలో మద్దిశెట్టి కుటుంబం కూడా అలాగే అరాచకాలు చేస్తున్నారని.. కరపత్రాల్లో అచ్చు వేశారు. నియోజకవర్గంలోని పనులకు కార్యకర్తల దగ్గర 12 శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు 30 శాతం కమీషన్లు వసూలు చేసి తెదేపా వారికి పెంచుతున్నారని ఆరోపించారు.
'నిజమైన వైకాపా కార్యకర్తలను దూరంగా పెట్టారు. ఓ సొసైటీ విషయంలో 30 లక్షలు డిమాండ్ చేశారు. ఇబ్బంది పెట్టి చెరువుల తీసుకున్న వారి దగ్గర 20 లక్షలు వసూలు చేశారు. ఆయన బాధ భరించలేక సొసైటీ వారు హైకోర్టుకు వెళ్లారు. పొలాలు కొని వెంచర్లు వేసినవారి దగ్గర కమీషన్లు వసూలు చేస్తున్నారు. వారి సొంత మనుషులు 5 మండలాలకు ఐదుగురిని నియమించి నియోజకవర్గంలోని ఎక్కువ పనులు తెలుగుదేశం వారికి ఇచ్చి ఎక్కువ కమీషన్లు తీసుకొంటున్నారు.' అని కరపత్రాల్లో రాశారు.
గిట్టని వాళ్లు చేసిన పనే: ఎమ్మెల్యే
కరపత్రాలపై ఎమ్మెల్లే వేణుగోపాల్ స్పందించారు. గిట్టని వాళ్లు చేసిన పని అని తెలిపారు. కావాలనే బురద జల్లుతున్నారని వెల్లడించారు. సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తానని వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నివర్ ప్రభావం...నెల్లూరులో భారీ వర్షం