ETV Bharat / state

విధుల నుంచి తొలగింపుపై ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన - Outsourcing employees protest in markapuram

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగస్థులు ఆందోళన చేపట్టారు. వారిని విధుల్లో నుంచి తప్పించటంపై నిరసన వ్యక్తం చేశారు.

Outsourcing employees
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగల నిరసన
author img

By

Published : Apr 13, 2021, 2:55 PM IST

విధుల్లో నుంచి తప్పించిన తమని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ.. మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగస్థులు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆందోళన చేశారు. ఒక్కసారిగా తమను విధుల్లో నుంచి తప్పిస్తే.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ ఆవేదన చెందారు. ఆర్​సీయూఈసీ 2017 నియామకాల్లో భాగంగా జూనియర్‌ అసిస్టెంట్‌, బిల్‌ కలెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు 750 మంది రాత పరీక్ష ద్వారా ఎంపికయ్యారు. వీరిని 2019 నవంబర్‌లో ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండీ.. సాయంత్రం.. గవర్నర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి చెంతకు తెదేపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.