ఒంగోలు నగరానికి చెందిన బొమ్మరిల్లు ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. వారితో పాటు తల్లిదండ్రులు ఉన్నా.. యాచక వృత్తో, ఇతర వ్యసనాల బారిన పడి.. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలూ ఉన్నారు. అలాంటి వారిని సంస్థ యజమాని రాజ్యలక్ష్మీ చేరదీసి చదివిస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. వీరిలో 8 మంది విద్యార్థులు క్యారమ్స్ క్రీడల్లో అత్యున్నత ప్రతిభ చూపుతున్నారు.
అండర్ - 12, 14లో రెండేళ్ల క్రితం జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు కొంతమంది ఎంపికై విశాఖ వెళ్లారు. అక్కడ ఒక విద్యార్థి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకోగా.. మరొకరి కాంస్య పతకం, మరికొందరు ఉత్తమ క్రీడాకారులుగా ఎంపికయ్యారు.
ఒంగోలుకు చెందిన క్యారమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు.. ప్రతిరోజూ ఆశ్రమానికి వచ్చి శిక్షణ ఇస్తున్నారు. జాతీయస్థాయి పోటీలకు చిన్నారులను సిద్ధం చేయడం తన లక్ష్యమని సుబ్బారావు తెలిపారు. అనాథ చిన్నారుల్లో నైపుణ్యాలు వెలికితీసి.. వారికి సహకరిస్తున్న ఆశ్రమం మరింత ముందుకువెళ్లాలని స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: Traffic at Hyderabad-Vijayawada Highway : సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ