ఒంగోలు బార్ అసోసియేషన్ 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర న్యాయవాదుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల టీ-20 క్రికెట్ మ్యాచ్ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు జడ్జి వెంకటరమణ హాజరై.. మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బౌలింగ్లో హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ బ్యాటింగ్ చేసి.. ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
ఇటువంటి క్రీడలు ఉత్సాహాన్ని ఇవడమే కాక.. సూక్ష్మంగా ఆలోచించగలిగే శక్తిని ఇస్తాయని న్యాయమూర్తి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీమతి వెంకట జ్యోతిర్మయి, బార్ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రావు, ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బొడ్డు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్