ప్రకాశం జిల్లాతో పాటు కడప జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకటో సొరంగం నుంచి నీటిని ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెలుగొండ నుంచి వచ్చే 43.7 టీఎమ్‌సీల నీటిని.. గొట్టిపడియా, కాకర్ల, సుంకేసుల ఆనకట్టల మధ్య నల్లమల జలాశయం ఏర్పాటుచేశారు. ఈ జలాశయంలో ఉన్న ముంపుగ్రామాల ప్రజలను నిర్వాసితులుగా గుర్తించి వారికి పునరావాసానికి ఏళ్ల తరబడి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెదారవీడు మండలంలో సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, కాటమరాజు తండా, చింతలముడిపి, మార్కాపురం మండలం గొట్టిపడియా, అక్క చెరువతండ, అర్థవీడు మండలంలో కృష్ణనగర్, రామలింగేశరపురం, లక్ష్మీపురం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
ఈ గ్రామాల పరిధిలో 2006లో చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం మొత్తం 4,565 కుటుంబాలను నిర్వాసితుల జాబితాలో చేర్చారు. ఇటీవల జరిగిన సమీక్ష అనంతరం 2019 అక్టోబర్ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తునట్లు అధికారులు ప్రకటించారు. ఈ విధంగా 2,990 మంది యువకులను అర్హులుగా చేర్చారు. కానీ ప్యాకేజీ అమలులో గందరగోళ పరిస్థితి నెలకున్నాయి. ఏ ప్రతిపాదన అమలు చేస్తారో అర్థం కాని పరిస్థితిలో నిర్వాసితులు ఉన్నారు.
గత ప్రభుత్వం పరిహారం కింద రూ.10.50 లక్షలు, ఇంటి స్థలంతో పాటు, ఇళ్లు నిర్మించి, 18 ఏళ్లు నిండిన వారికి 6.75 వేల ఒన్ టైమ్ సెటల్మెంట్ ఇస్తామని ప్రకటించారు. స్థానికుల అభ్యర్థన మేరకు పరిహారాన్ని రూ.12.50 లక్షలు పెంచేందుకు అప్పటి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ప్రతిపాదనులు తీసుకువచ్చి, ప్రభుత్వానికి పంపారు. తాము అధికారంలోకి వస్తే రూ.20 లక్షలు చేస్తామని వైకాపా ప్రకటించింది.
కానీ అధికారంలోని వచ్చిన వైకాపా...గత ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారాన్ని ఖరారు చేసింది. ఒన్ టైమ్ సెటిల్మెంట్గా ఇచ్చేందుకు ప్రతిపాదన తీసుకువచ్చారు. కానీ ఇంటి నిర్మాణం చేపట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోదని తెలిపింది. నిర్వాసితుల కాలనీలో 5 సెంట్లు స్థలం మాత్రం ఇస్తామని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే 5.5 లక్షలు మినహాయించుకుని మిగతా సొమ్ము పరిహారం కింద ఇస్తారు. రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రక్టర్లు ముందుకు రావడం లేదనే ఉద్దేశంతో ఇంటి నిర్మాణం విషయంలో ప్రభుత్వం వెనుకడగువేయడం నిర్వాసితులు నిరాశకు గురవుతున్నారు.
స్థలాలు సేకరణ సుంకేసుల గ్రామానికి మార్కాపుం మండలంలో గోగుదిమ్మె... పెద్దారవీడు మంబడలం తోకపల్లి వద్ద 300 ఇళ్లకు లే అవుట్ ఏర్పాటుచేశారు. గొట్టిపడియా, గుండంచర్లకు మినహా మిగతా పట్టాలు ఇచ్చారు. గొట్టిపడియా వేమలకోటవద్ద 82 ఎకరాలు 953 మందికి పట్టాలు సిద్ధం చేశారు. ఒన్ టైమ్ సెటిల్‌మెంట్‌కు అంగీకరించారని కారణంగా... తక్షణం గ్రామలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇళ్లను కూలగొట్టేందుకు సర్వే కూడా ప్రారంభించారు. నిర్వాసితుల కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్రామాలను ఎలా ఖాళీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
మరికొందమంది పేర్లు గల్లంతవ్వడం, వలసవెళ్ళినవారిలో చాలా మంది పేర్లు తొలగిపోవడం వల్ల అర్హులైన వారు నష్టపోతున్నామని నిర్వాసితులు అంటున్నారు. సర్వే చేసిన నాటికి గ్రామంలో లేకుండా, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు గల్లంతు కావడంతో తమ పేర్లు జాబితాలో పెట్టాలని కోరుతున్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: