ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో... పాత పనులు పూర్తి చేసే విషయంలో నేతలు స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. రెండేళ్ళలో కొత్త పనులు చేపట్టపోగా, పాత పనులు కూడా అసంపూర్తిగా ఉంచేసారని స్థానికులు మండిపడుతున్నారు. 2018-19 ఏడాదిలో SC కాంపెనెంట్ గ్రాంట్‌లో దాదాపు 10కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు ఇంతవరకూ చేపట్టలేదు.
కొన్ని పనులు చేస్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అంటూ పనులు నిలిపేసారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో రహదారులన్నీ సగంలోనే ఆగిపోయాయి. ఒకవైపు రోడ్డు వేసి, రెండో వైపు వేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
అక్కడకక్కడ గుంతలు ఉండటంతో ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయని అంటున్నారు. వర్షం కురిసినా నీరు నిలిచిపోయి.. అస్తవ్యస్తంగా మారుతోందంటున్నారు. ఓటు కోసం వచ్చే నాయకులు... నగర సమస్యల్లో మాత్రం మోహం చాటేస్తున్నారని విమర్శిస్తున్నారు. కనీసం పాత పనులైనా పూర్తి చేయాలని నగర వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: