ETV Bharat / state

15 ఏళ్లకే కథలు రాసేస్తారు... నాటకాలు వేసేస్తారు..! - ongole government school students package news

మన ముందు తరం వారు పుస్తకాలను స్నేహితులుగా భావించేవారు. వారి కబుర్లు, సంతోషాలు, జ్ఞాపకాలు అన్నీ అక్షరాలతోనే ముడిపడి ఉండేవి. అయితే.. ఈ సాంకేతిక యుగంలో పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయింది. కనీసం పేపరైనా చదివే అలవాటులేదు ఇప్పటి మిలీనియల్స్​కు. ఇక పుస్తకాల సంగతి చెప్పనక్కర్లేదు. అయితే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం నానుడిని నిజం చేస్తున్నారు ఆ విద్యార్థినులు. మరి వారి గురించి మనమూ తెలుసుకుందామా..!

ongole government school students package
ఒంగోలు గవర్నమెంట్ స్కూల్
author img

By

Published : Dec 14, 2019, 8:02 AM IST

పుస్తక పఠనంతో సృజనాత్మకత పెంచుకుంటున్నవిద్యార్థినులు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు పుస్తక పఠనాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బడిలోని గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని సృజనాత్మకత పెంచుకుంటున్నారు. కథలు, నాటికల ద్వారా జాతీయ స్థాయి వేదికల్లో పేరు సంపాదించారు.

కథలు రాసేస్తున్నారు

నీతికథలు చదివిన పిల్లల్లో మంచి నడవడిక అలవాటవుతుంది. అవే కథలు పిల్లలు రాస్తే నిజంగా అభినందించాల్సిందే. ఆ విద్యార్థులు అదే చేస్తున్నారు. నిత్యం పుస్తక పఠనంతో భాష మీద పట్టు సాధించారు. 15 ఏళ్లకే కథలు, నాటికలు రాసే స్థాయికి ఎదిగారు. రాయడమే కాదు వాటిని వినసొంపుగా చెప్పడంలోనూ మెప్పిస్తారు. కథల్లో జీవం ఉట్టిపడేలా రాయడం వారి ప్రత్యేకత. ఇటీవల గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కథల పోటీల్లో షేక్ మస్తాన్ అనే విద్యార్థిని ప్రథమ బహుమతి అందుకుంది.

పుస్తక పఠనంతోనే సాధ్యం

ఈ విజ్ఞానమంతా పుస్తక పఠనంతోనే అలవడిందని చెప్తారు విద్యార్థులు. ఇదంతా తమ పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాల కొరత లేకుండా చూసిన ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. ప్రకాశం గ్లోబల్ ఎన్నారై సంస్థ ప్రతినిధులు గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అందిస్తే... ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలతో ఇంకొన్ని కొనుగోలు చేశారు. తెలుగు ఉపాధ్యాయిని ఝాన్సీ.. విద్యార్థులకు కథలు, కవితలు రాయడం అలవాటు చేశారు. వీరు ప్రదర్శించిన నాటిక రాష్ట్ర స్థాయిలో నంది బహుమతి అందుకుంది. అంతే కాదు దిల్లీలోనూ నాటకం ప్రదర్శించే స్థాయికి చేరుకున్నారీ విద్యార్థులు. పుస్తక పఠనం కేవలం తమలోని సృజనాత్మకత వెలికి తీయడమే కాకుండా బట్టీ చదువులకు స్వస్తి పలికి చదువుని ఇష్టంగా మార్చిందని ఆనందంగా చెబుతున్నారు అక్కడి విద్యార్థినులు.

ఇవీ చదవండి:

టిక్ టాక్ స్నేహం... వివాహిత, ఇద్దరు పిల్లలు అదృశ్యం..!

Intro:AP_ONG_13_12_KATHALA_ALLIKA_KAVITALA_MALLIKA_STORY_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................................................
పుస్తక పఠనం ఓ అద్భుత అభిరుచి ... గ్రంథాలయాలు విలువైన వనరులు... కారణాలు ఏమైనా సమాజంలో పుస్తక పఠనం తగ్గిపోతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు లోని బండ్ల మిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల అందుకు భిన్నం ఇక్కడి విద్యార్థులు అందుబాటులోని గ్రంథాలయాన్ని వినియోగించుకొని పుస్తక పఠనం ద్వారా తమ ప్రతిభను ఇనుమడింప చేసి సత్తా చాటుతున్నారు. సృజనాత్మకతను బయటకు తీసి అంతర్జాతీయ వేదికల్లో సైతం జిల్లా పేరును నిలుపు తున్నారు.

వాయిస్ ఓవర్:
నీతి కథలు పిల్లల చేత చదివిస్తే చక్కని నడవడిక అలవాటవుతుంది అవే నీతి కథలు చిన్నపిల్లలే రాస్తే వారిని తప్పక అభినందించాల్సిందే..... చక్కని సందేశాన్ని, చైతన్యాన్ని పెంపొందించే నాటికలు చిన్నారులకు చూపిస్తే సక్రమ మార్గంలో వారిని నడిపించే తోవ చూపినట్లే... అవే నాటికలు రచించి నటించి మెప్పిస్తే వారిని తప్పకుండా వెన్ను తట్టి ప్రోత్సహించాల్సిందే... ఇటువంటి ప్రతిభని చూపుతున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు బండ్ల మిట్ట బాలికోన్నత పాఠశాల విద్యార్థులు. తమలోని ఇంతటి ప్రతిభ కు కారణం పాఠశాలలోని గ్రంథాలయం నిక్కచ్చిగా చెప్తారు ఇక్కడ విద్యార్థులు. నిత్యం పుస్తక పఠనం ద్వారా భాష మీద పట్టు తో పాటు కథలు నాటికలు రాసే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదించుకొన్నామని అంటారు. ఇక్కడి విద్యార్థులు కథలు చెప్పే తీరు చూస్తే ఎంతటి వారైనా చిన్నపిల్లలై ఊ కొట్టాల్సిందే కథ మొత్తం విన్నాక చేతులు నొప్పి పెట్టేలా చప్పట్లు మోత మోగించాల్సిందే. ఊహల ప్రపంచంలో నేను అనే అంశంపై అప్పటికప్పుడు విద్యార్థినులు అల్లిన రచన అద్భుతమే అని చెప్పాలి. నా ఊహల ప్రపంచంలో నేను మహారాణి అంటూ చిన్నారి పలికిన పలుకులు ఆమె ఆలోచన తీరుని కళ్లకు కట్టింది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో కథలు రాయడంలో షేక్ మస్తాన్ అనే విద్యార్థిని పూర్వపు కలెక్టర్ వినయ్ చందు నుంచి ప్రధమ బహుమతి అందుకుంది కథల్లో జీవం ఉట్టిపడేలా రాయడం ఆమె ప్రత్యేకత భావుకత పండించడం లోనూ ఆమెది అందె వేసిన చేయి అదేవిధంగా ధనలక్ష్మి అనే విద్యార్థిని సొంతగా నాటిక ,కథ రాసి గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా జిల్లా విద్యాధికారి సుబ్బారావు నుంచి బహుమతి అందుకున్నారు .ఇటీవల పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు ఈ చిన్నారులతో మాట్లాడి విద్యార్థులను ప్రోత్సహించారు విద్యార్థులు చెప్పిన కథలు చక్కగా విని అభినందించారు కథలో నీతి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ధీరత్వం తో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు....బైట్స్
1. సౌమ్య, పర్యావరణ రక్షణ కథతో బహుమతి పొందిన బాలిక
2.షేక్ ముస్తాన్, కథలు చెప్పడంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి
3.సమీన, విద్యార్థిని
4.ధనలక్మి, నాటిక, కథల రచన
5.హరిణి, ఢిల్లీ లో ప్రదర్శించిన నాటికలో ప్రధాన పాత్ర
6.హెప్సిభ, విద్యార్థిని

విద్యార్థులు

వాయిస్ ఓవర్:
విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం లో పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న విద్యార్థులు తమ పాఠశాలలో గ్రంథాలయం లో పుస్తకాల కొరత లేకుండా చూసిన ప్రధానోపాధ్యాయుడు సనత్ కుమార్, తెలుగు ఉపాధ్యాయిని ఝాన్సీ కి కృతజ్ఞతలు తెలుపుతారు. ఒకప్పుడు పాఠశాలలో గ్రంథాలయం ఉందని కానీ పుస్తకాల కొరత వెక్కిరిస్తూ ఉండేది ఈ సమయంలో ప్రకాశం గ్లోబల్ ఎన్నారై సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ నగరంలోని వైద్యుడు కొర్రపాటి సుధాకర్ ప్రసాద్ ఇక్కడి ఉపాద్యాయుడు కరుణాకర్ ప్రోత్సాహంతో 25000 విలువచేసే పుస్తకాలు గ్రంథాలయానికి అందించారు. విద్యాశాఖ పాఠశాలకు పది వేల రూపాయల నిధులు అందజేస్తుంది ఈ నిధులను ఈ బాలికోన్నత పాఠశాల సద్వినియోగం చేసుకుంది. ఇక్కడ ఉన్న చిత్రలేఖన ఇతర పుస్తకాల సహాయంతో విద్యార్థులు సృజన శీలురు గా రూపొందించారు. తెలుగు ఉపాధ్యాయుని ఝాన్సీ విద్యార్థుల చేత సొంతగా కథలు కవితలు రాయడం అలవాటు చేశారు. దీని ద్వారానే వారి సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. అందుకే ఇక్కడ విద్యార్థులు రాష్ట్ర జాతీయ వేదిక లో సైతం ప్రతిభను కనబరుస్తున్నారు. రాష్ట్రస్థాయిలో వీరు ప్రదర్శించిన నాటీక నంది బహుమతి సైతం కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా మైనంపాడు అనే గ్రామంలో చిన్న ప్రదర్శనతో ప్రారంభమైన వీరి ప్రస్థానం దేశ రాజధాని ఢిల్లీలో సైతం నాటక ప్రదర్శన స్థాయికి చేరుకున్నారు అంటే వీరి ప్రతిభ ఏపాటిదో తెలుస్తోందనే చెప్పాలి. ఢిల్లీ లో ప్రదర్శించిన నాటిక కోసం తెలుగు నాటికను ఆంగ్లం లోకి అనువాదించిమరీ చక్కని ప్రదర్శన చేశారు.
బైట్స్
7. ఝాన్సీ ,తెలుగు ఉపాధ్యాయిని
8. భారతి , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని

వాయిస్ ఓవర్:
పుస్తక పఠనం కేవలం తమలోని సృజనాత్మకతను వెలికి తీయడమే కాకుండా బట్టీ చదువులకు స్వస్తి పలికి చదువుని ఇష్టంగా చదివేలా తీర్చిదిద్దిందని ఇక్కడి విద్యార్థినులు అంటున్నారు.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.