ETV Bharat / state

అర్థాంతరంగా ఆగిన ఒంగోలు తాగునీటి పథకం - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు చేపట్టిన శాశ్వత తాగునీటి పథకానికి మోక్షం లభించడంలేదు. గత ప్రభుత్వ హయంలో కేంద్రప్రభుత్వం అమృత్ పథకం ద్వారా ముంజూరైనా ఈ పథకాన్ని నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో చివరి దశలో పనులు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవడం వల్ల దాదాపు మూడు లక్షల మంది తాగునీటి కష్టాలకు పరిష్కారం లభించడంలేదు.

అర్థాంతరంగా ఆగిన ఒంగోలు తాగునీటి పథకం
అర్థాంతరంగా ఆగిన ఒంగోలు తాగునీటి పథకం
author img

By

Published : Sep 23, 2020, 9:22 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు... సాగర్‌ నుంచి రామతీర్థాలకు వచ్చే నీటిని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో నింపి తాగునీటిగా అందిస్తారు. ప్రతీ నాలుగు నెలలకొకసారి సాగర్‌ నుంచి వచ్చే జలాలే పట్టణవాసులకు దిక్కు. ఒంగోలు నగర పాలక సంస్థగా ఉన్నతి పొందిన తర్వతా చుట్టుపక్కల 7 గ్రామాలు... నగర పాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఆ గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల మంచి నీటి సరఫరాపై ప్రభావం పండింది. పట్టణ ప్రజలతోపాటు, శివారు కాలనీలు, విలీన గ్రామాలకు కలిపి దాదాపు 3 లక్షల మందికి రోజూ సురక్షిత జలాలను పంపిణీ చేయాల్సి ఉంది.

వాటా చెల్లించని నగరపాలక సంస్థ

సాగర్‌ జలాలు సరిపోని కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒంగోలుకు శాశ్వత మంచినీటి పథకం ద్వారా తాగునీరు అందించాలని గత ప్రభుత్వం భావించింది. దీనికి కేంద్రం ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా శాశ్వత మంచినీటి పథకాన్ని రూపకల్పన చేశారు. 123 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచి, పనులు కూడా ప్రారంభించింది. ఇందులో కేంద్రప్రభుత్వం రూ.37 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14 కోట్లు, నగర పాలక సంస్థ మిగిలిన రూ.71 కోట్లు వాటాగా భరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను పూర్తి స్థాయిలో విడుదల చేశాయి. నగర పాలక సంస్థ తమ వాటా చెల్లించడానికి ముందుకు రాలేదు. దీంతో గుత్తేదారుడు బకాయిలు అందక పనులు మధ్యలో నిలిపేశారు.

చివరి దశలో నిలిచిన పనులు

వైకాపా ప్రభుత్వం వచ్చాక నగర పాలక సంస్థ కూడా తన వాటా నిధులు మంజూరు చేయడానికి ఆలోచిస్తుంది. గత పాలక పక్షం మంజూరు చేసిన పథకాన్ని, అప్పటి గుత్తేదారుడికి చెల్లించాల్సిన బకాయిలు ఇప్పుటి ప్రభుత్వం ఎందుకు చెల్లించాలనే దృష్టితో ప్రస్తుత పాలకులు ఉన్నట్లు తెలుస్తోంది. గుండ్లకమ్మ వద్ద నిర్మించాల్సిన పంపు హౌస్, 15.2 కిలోమీటర్ల పైపు లైన్‌లో దాదాపు 13 కిలోమీటర్ల లైను నిర్మాణం పూర్తయ్యింది. పట్టణంలో నిర్మిస్తున్న ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు మధ్యలో నిలిచిపోయాయి. దాదాపు చివరి దశకు వచ్చిన పనులు దాదాపు ఏడాదిన్నరగా నిలిచిపోయాయి. ప్రస్తుతం పట్టణంలో తాగునీటి సమస్య రోజు రోజుకూ తీవ్రతరం అవుతుండడం వల్ల తక్షణం ఈ పథకాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్ర మంత్రి బాలినేని సొంత నియోజకవర్గం కావడం వల్ల ఈ పథకంపై మంత్రి దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి : శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.