ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ శాసనసభ్యుడు బి.ఎన్. విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని తెలిపారు. విశాఖ ప్రమాదంలో బాధితులకు ఇచ్చిన నష్టపరిహారం తరహాలో ప్రకాశం జిల్లాలోనూ అమలు చేయాలని ఆయన కోరారు. జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి