ETV Bharat / state

వీరన్నపాలెంలో వైద్య సహాయం కోసం వృద్ధుడు ఎదురుచూపు

పిల్లలు బతుకుదెరువు కోసం పట్నం వెళ్లటంతో ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్నాడు ఓ వృద్ధుడు. ఇంతలో అనారోగ్యం మీద పడటంతో ఆసుపత్రికి వెళ్లలేక రోడ్డుపైనే పడిపోయాడు. చుట్టూ ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చమని కోరినప్పటికీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు.

medical help
వైద్యసహయం కోసం ఎదురుచూపు
author img

By

Published : Apr 28, 2021, 10:10 AM IST

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన కొండపాటూరు సంజీవ అనే డెబ్భై ఏళ్ల వృద్ధుడు వైద్య సహాయం కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నాడు. తనను 'ఆసుపత్రికి తీసుకెళ్ళండయ్యా' అంటూ ప్రాధేయపడటం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. వృద్ధుని పిల్లలు వృతిరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. మరోవైపు అతను జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో కొవిడ్​ భయంతో సహాయం చేయటానికి గ్రామస్థులు జంకుతున్నారు. 108 వాహనానికి ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి తోడు ఎవరైనా ఉంటేనే తీసుకెళతామని చెప్పి వెళ్లిపోయారని చెబుతున్నారు.

ఇదీ చదవండీ.. అత్యవసర స్థితిలో ప్రాణాలు నిలబెడుతున్న ఆక్సిజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.