ETV Bharat / state

ఈ పెద్దాయన ముక్కుతో ఫ్లూటు ఊదితే... మనసుకు కవ్వింతే!

సంగీతానికి పులకించని ప్రాణి ఉండదంటే అతిశయోక్తి కాదు. మధరమైన గానంతో ఆకట్టుకునేవారు కొందరైతే.... ఆ గానానికి వాద్య మేళవింపునిచ్చి ఆనందాన్ని నింపేవారు ఇంకొందరు. అలాంటి కోవకే చెందిన ఈ వృద్ధుడు వినూత్నంగా పిల్లనగ్రోవి వాయిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 83ఏళ్ల వయసులోనూ సంగీతప్రియులను అలరిస్తున్నారు.

old man blowing flute with nose at prakasham district
ప్రకాశం జిల్లాలో ముక్కతో ఫ్లూటు ఊదుతున్న వృద్ధుడు
author img

By

Published : Jan 16, 2020, 6:02 AM IST

Updated : Jan 16, 2020, 7:22 PM IST

ప్రకాశం జిల్లాలో ముక్కతో ఫ్లూటు ఊదుతున్న వృద్ధుడు

కళల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకతే వేరు. అందుకే తరాలు మారుతున్నా ప్రజల ఆదరణ చూరగొంటూనే ఉంది సంగీతం. అలా సంగీతంపై ఇష్టంతో పిల్లనగ్రోవిని వాయిస్తూ... ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం మూలగానివారిపాలేనికు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు అక్కల వీరస్వామిరెడ్డి.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇంత వయసులోనూ ముక్కుతో పిల్లనగ్రోవిని వాయిస్తూ.. సప్త స్వరాలను అద్భుతంగా పలికిస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సన్నని వెదురుబొంగులతో సుమారు 14, 24 అంగుళాలు ఉన్న రెండు పిల్లనగ్రోవులను సొంతంగా తయారు చేశారు. ఆ రెండిట్లో నాగ స్వరాలు పలికిస్తూ.... అబ్బురపరుస్తున్నారు.

వీరస్వామికి నాటకాలపై మక్కువ ఎక్కువ. ఆ అభిరుచిని కొనసాగిస్తూనే.. పిల్లనగ్రోవిని వాయిస్తున్నారు. నాదస్వరం వినిపించి శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కారణంగా శ్వాసకోస సమస్యల ఎదుర్కొని.. ఇప్పటికి ఐదు సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయినా.. పిల్లనగ్రోవి ఊదడంపై అసక్తితో కొనసాగిస్తూనే ఉన్నారు. సంక్రాంతి సెలవులకు వచ్చిన బంధువులు ఈయన ముక్కుతో చేసే వేణుగానం విని ఎంతో సంతోషించారు.

తనకు శక్తి ఉన్నంత వరకూ ముక్కుతో పిల్లనగ్రోవిని వాయిస్తునే ఉంటానని వీరస్వామిరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

రాజధాని సమస్య 29 గ్రామాలకే కాదు... రాష్ట్రం మొత్తానిది: జేసీ

Intro:FILE NAME : AP_ONG_44_14_OLDMAN_MUKKU_THO_FLOOT_PKG_BYTS_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
నోట్ : స్క్రిప్ట్ విజువల్స్ ఫైల్ లో పంపించాను పరిశీలించగలరు సార్.

బైట్ : 1 : అక్కల వీరాస్వామి రెడ్డి, .ముక్కుతో పిల్లనగ్రోవి ఊదే వృద్ధుడు, మూలగానివారిపాలెం.
బైట్ : 2 : సురేష్, కడవకుదురు.
బైట్ : 3 : వెంకట రమణారెడ్డి, వీరస్వామిరెడ్డి కుమారుడు.
బైట్ : 4 : ఎ. స్వామిరెడ్డి, విశ్రాంతఉద్యోగి.
బైట్ : 5 : గంగిరెడ్డి, మూలగానివారిపాలెం.

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Last Updated : Jan 16, 2020, 7:22 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.