Old age couple protest with petrol bottle in Prakasam district: ప్రకాశం జిల్లా వెలిగండ్ల తహసీల్దార్ కార్యాలయంలో వృద్ధ దంపతులు పెట్రోల్ సీసాతో బైఠాయించారు. ఇతరులు తమ పొలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు మరో ఆధారం లేదని.. ఆత్మహత్యే శరణ్యమని వృద్ధుల ఆవేదన వ్యక్తం చేశారు.
జేసీ ఆదేశాలు సైతం తహసీల్దార్ పట్టించుకోవడం లేదని.. ఏడాది నుంచీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆ వృద్ధులు వాపోయారు. ఇక తమకు ఆత్మహత్యే దిక్కు అని పేర్కొంటూ... పెట్రోల్ సీసాతో వెలిగండ్ల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి..