ETV Bharat / state

చేతులెత్తేసిన ఇంజినీర్లు.. గుండ్లకమ్మ జలాశయం ఖాళీ - నీటి వృథా దురదృష్టకరం

GUNDLAKAMMA RESERVIOR : గుండ్లకమ్మ జలాశయం ఖాళీ అయ్యింది. దెబ్పతిన్న మూడో గేట్లుకు మరమ్మతులు చేసేందుకు ఇంజినీర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక చేసేది లేక జలాశయంలోని నీటిని మొత్తం సముద్రంలోకి వదిలివేశారు. 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.

GUNDLAKAMMA RESERVIOR
GUNDLAKAMMA RESERVIOR
author img

By

Published : Sep 4, 2022, 10:18 AM IST

GUNDLAKAMMA PROJECT : ప్రకాశం జిల్లాలో కీలకమైన గుండ్లకమ్మ జలాశయం ఒక్కసారిగా ఖాళీ అయింది. గతనెల 31 వరకు మూడు టీఎంసీలతో ఇది నిండుకుండను తలపించింది. తాజాగా మూడో గేటు దెబ్బతినడం, దానికి మరమ్మతు కోసం శుక్రవారం 13, 14, 15 గేట్లు, శనివారం 11, 12 గేట్లు ఎత్తి నీరు దిగువకు వదిలేయడంతో ఇప్పుడు కేవలం 0.516 టీఎంసీలే మిగిలాయి. అయినా మరమ్మతు సాధ్యం కాలేదు. ఆదివారం పనులు ప్రారంభిస్తామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

గుండ్లకమ్మ స్పిల్‌వే ప్రమాదంలో ఉన్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పది గేట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని, పనులు చేయాల్సి ఉందని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం.. నీరంతా వృథాగా వదిలిపెట్టడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఖరీఫ్‌ సాగుతో పాటు 82 గ్రామాల తాగు నీటికి అవసరమైన జలమంతా గేటు పగిలిపోయి సముద్రం పాలైంది. ఇప్పటి వరకు 25 వేల క్యూసెక్కులు సముద్రంలో కలిసిందని అధికారుల అంచనా.

నీటి వృథా దురదృష్టకరం: మంత్రి అంబటి
గుండ్లకమ్మ మూడో గేటు మరమ్మతు కోసం రెండు టీఎంసీలను దిగువకు వృథాగా వదలక తప్పట్లేదని, ఇది దురదృష్టకరమని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మద్దిపాడు మండలం మల్లవరంలోని జలాశయాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నీటి వృథాను అరికట్టేందుకు స్టాప్‌లాక్స్‌ పెట్టడం సాధ్యం కాలేదని, ఇప్పటికే టెండరు పూర్తయిన 6, 7 గేట్లతోపాటు త్వరలోనే మొత్తం పది గేట్ల పనులు పూర్తి చేస్తామని వివరించారు. సాగుకు ఇబ్బంది లేకుండా చూస్తామని, అవసరమైతే నాగార్జునసాగర్‌ కాలువ నుంచి నీళ్లు మళ్లించి ప్రాజెక్టు నింపుతామని తెలిపారు.

అధికారుల ప్రయత్నం విఫలం.. గుండ్లకమ్మ జలాశయం ఖాళీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.