ఎన్టీఆర్ కళాపరిషత్ నాటక పోటీలు జనవరి 10 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు... ఆ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు 25 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్నందునా... అందుకే ఈ వేడుకలను కుదించడం జరిగిందని వివరించారు. ప్రత్యేక పోటీ విధానంలో నృత్య రూపకాలు, కోలాటం పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటకాలు, నృత్య రూపకాలు, కోలాటం పోటీల్లో పాల్గొనాలనుకునేవారు.. ఈనెల 31 లోపు ఎంట్రీలను పంపాలని హరిబాబు కోరారు. పారితోషికంతోపాటు ఈ సంవత్సరం నుంచి అద్భుత ప్రదర్శన కనబరచిన వారికి మొదటి బహుమతిగా నగదు అందజేస్తున్నామని తెలియజేశారు.
ఇవీ చదవండి...15 ఏళ్లకే కథలు రాసేస్తారు... నాటకాలు వేసేస్తారు..!