ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా... తెదేపా నేతలు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. మద్దిపాడు మండలం తెల్లపాడు గ్రామం ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బియ్యం విజయ్ కుమార్, దర్శి నియోజకవర్గ బాధ్యుడు రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కందుకూరు,దర్శి, చీరల, కనిగిరి, అద్దంకి, పర్చూరు,బల్లికురవ తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తెదేపా శ్రేణులు నివాళులర్పించారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు ఇతర నాయకులు, కార్యకర్తలు.. నివాళి అర్పించారు. జిల్లాలో పలు చోట్ల కార్యకర్తలు రక్తదానం, అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇదీ చదవండి: