ETV Bharat / state

ప్రవాసాంధ్రుల ఉదారత..సర్కారీ బడి విద్యార్థులకు పుస్తకాలు

విదేశాలకు వెళ్లారు. ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారు. ఇక్కడి జనాన్ని మాత్రం మరువనే లేదు. విజ్ఞానమే మార్పు తీసుకురాగలదనే సంకల్పంతో వీధి బడుల్లో సంస్కరణకు శ్రీకారం చుట్టారు. లక్షల రూపాయలు పోగేసి గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలో నివసించే పలువురు ప్రముఖులు ఈ ఆశయ సాధనలో తమవంతు కృషి చేస్తూ తోడ్పడుతున్నారు. వారేవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.

books donation for government schools in prakasam
సర్కారీ బడుల్లో పుస్తకాల వితరణ
author img

By

Published : Mar 27, 2021, 7:34 AM IST

ప్రవాసాంధ్రుల పుస్తక స్పూర్తి

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సామర్థ్యాలు, విశ్లేషణా శక్తి పెంచే రీతిలో ప్రవాసాంధ్రులు చేపట్టిన 'పుస్తకాలతో స్నేహం' అనే కార్యక్రమం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సర్కారీ బడుల్లో విద్యార్థులకు వివిధ రకాల సాహిత్యంతో కూడిన పుస్తకాలు ఉచితంగా అందిస్తూ.. భవిష్యత్తులో వారు ప్రయోజకులుగా ఎదిగేలా తమవంతు కృషి చేస్తున్నారు. వివిధ దేశాలు, వృత్తుల్లో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 250 మంది.. ప్రకాశం గ్లోబల్‌ ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్‌ అనే సంస్థగా ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ కొర్రపాటి సుధాకర్‌, సాహితీవేత్త సీ.ఎ.ప్రసాద్‌ ప్రవాసాంధ్రుల తరఫున ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

మూడేళ్లలో 160 పాఠశాలల్లో కార్యక్రమాలు..

పుస్తకాలు అందజేసిన తర్వాత వాటిని పిల్లలకు అలవాటు చేసేలా 2 రోజుల పాటు వర్క్‌ షాపు నిర్వహించి.. పిల్లలతో కథలు చదవించడం, వాటిని నాటకాలుగా ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ప్రకాశం జిల్లాలో మూడేళ్ల నుంచి సుమారు 160 పాఠశాలల్లో 'పుస్తకాలతో స్నేహం' కార‌్యక్రమంలో భాగంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. చరిత్ర, సైన్స్‌, సాహిత్యం లాంటి వివిధ అంశాలతో కూడిన పుస్తకాలు అందజేస్తూ వస్తున్నారు.

జీవితంలో తాము ఉన్నత స్థానాలకు ఎదగడం సహా పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ప్రకాశం గ్లోబల్‌ ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్‌ స్థాపకుల ఆదర్శం ప్రశంసలు పొందుతోంది.

ఇదీ చదవండి:

డబ్బులు లేకున్నా లాటరీ టికెట్- రూ.6కోట్ల జాక్​పాట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.