భూగర్భ జలాల వృద్ధికి ప్రాణాధారంగా నిలచే చెరువుల్లో నీరు లేక వెలవెలపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లల చెరువు మండలాల్లో ఉన్న చెరువులన్నీ వర్షాలు లేకపోవటంతో ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకు గడ్డి, పిచ్చి మెుక్కలతో చెరవులు దర్శనమిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కొద్దిపాటి నీరు కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చెరువు పూడికలు తీయిస్తే సాగు నీటికి కొంతైనా ఇబ్బందులు తొలగుతాయని రైతులు అంటున్నారు. .
ఇదీ చదవండి : విద్యుత్ మోటార్ల అపహరణ..ముఠా అరెస్టు