ETV Bharat / state

వైరస్​ నిరోధకం మూడు నాళ్ల ముచ్చటేనా? - chirala red zone news

ప్రకాశం జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన వైరస్​ నిరోధక ద్వారం మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన మూడు రోజులకే ఇది పనిచేయడం మానేసింది.

no use to  anti-virus gate
నిరూపయోగంగా వైరస్​ నిరోధక ద్వారం
author img

By

Published : May 14, 2020, 11:03 AM IST

కరోనా వైరస్ నిరోధక ద్వారం ప్రకాశంజిల్లా చీరాలలో మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద గత నెలలో వైరస్​ నిరోధక ద్వారాన్ని మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. రెండు రోజులు ముచ్చటగా వినియోగించిన తర్వాత దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ ద్వారం పనిచేయడం లేదంటూ స్థానికులు చెబుతున్నారు.

చీరాల రెడ్​ జోన్​లో ఉండటం వల్ల ఉదయం 6 నుంచి 9 గంటల లోపు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. మార్కెట్ వద్ద నిరుపయోగంగా ఉన్న వైరస్ నిరోధక ద్వారాన్ని.. ఉదయం వేళ రద్దీగా ఉండే గడియార స్తంభం కూడలిలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

నకిలీ ఎక్సైజ్ అధికారుల హల్​చల్... పట్టించిన మద్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.