ప్రకాశం జిల్లాలో లక్షమందిదికి పైగా వికలాంగులు ఉండగా, 41 వేల మందికి ప్రభుత్వ పింఛన్ అందుతోంది. ప్రస్తుతం సదరంలో పరీక్షించుకొని పత్రాలు కోసం ఎదురుచూస్తున్నవారు దాదాపు 2000 మంది ఉన్నారు. వారిలో కొందరు కొత్తగా దరఖాస్తు చేసుకోగా.., మరికొందరు గతంలో ఇచ్చిన మాన్యువల్ ధ్రువీకరణ పత్రాల సమయం ముగిసిపోవడంతో కొత్తగా దరఖాస్తు చేశారు. గతంలో ఇచ్చిన పత్రంలో తక్కువ పర్సంటేజీ రావడంతో ఈసారి ప్రయత్నించి చూద్దామనే ఆశతో దరఖాస్తు చేసినవారు లేకపోలేదు. శారీరక (ఆర్థో), మానసిక, బదిర, పక్షవాతం, ఈఎన్టీ, ఆప్తమాలజీ విభాగాల వైద్యులు వాటిని పరిశీలిస్తారు. అందుకు వారికి గౌరవ వేతనం లభిస్తుంది. ప్రతి విభాగంలో ముగ్గురు పైద్యులు పరిశీలించాక పత్రాన్ని జారీ చేస్తారు.
పెండింగ్లో ఉన్న పత్రాల్లో మొదటి డాక్టర్ పరిశీలన పూర్తయింది. మిగిలిన ఇద్దరు వైద్యులు వారి లాగిన్లో నుంచి పార్వర్డ్ చేయక కొన్ని నిలిచిపోయాయి. సదరం పత్రాలు అందక ఉద్యోగావకాశాలు పొందలేక పోతున్నారని, బస్సు, రైల్వే పాసులు, రేషన్ కార్డులు, రుణాలకు దూరమవుతున్నారని, ఇటీవల వికలాంగుల సంక్షేమ సంఘాలు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాయి. ఒకే సారి శాశ్వత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరుతున్నాయి.
మంచంపై నుంచి కదల్లేరు...
నాగులుప్పలపడు మండలం హనుమపురు గ్రామానికి చెందిన అంజయ్య పక్షవాతం కారణంగా తొమ్మిది సంవత్సరాలుగా మంచానికి పరిమితం అయ్యారు. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏపనీ చేసుకోలేడు. అన్ని పనులు మంచంపైనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైద్యులు పరిశీలించి పక్షవాతంలో వెన్నుముక పడిపోయి లేవలేని పరిస్థితిని గుర్తించారు. ఆ మేరకు దివ్యాంగుడిగా గుర్తించి పత్రం జరీ చేశారు. త్వరలో సదరం పత్రం, మార్చి 1 నుంచి పింఛన్ వస్తుందని అధికారులు చెప్పారు. అయినా ఇప్పటి వరకు రాలేదని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు.
నవంబరు 3 నుంచి ప్రారంభిస్తాం
కొవిడ్ వల్ల సదరం శిబిరాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నవంబరు 3 నుంచి శిబిరాలను ప్రారంభిస్తాం. త్వరలో షెడ్యూలు ప్రకటించి అన్ని ఏరియా ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తాం. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన వారిలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. అలాగే అర్హులకు పత్రాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
-ఉషా, వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త
ఇదీచదవండి