ETV Bharat / state

రోగులున్నారు.. అవసరమైనంతగా డాక్టర్లే లేరు!

రోగులకు అవసరమైనంతగా వైద్యులు లేరు... పరికరాలూ పనిచేయవు.. ప్రసవాలు, శస్త్ర చికిత్సలు చేయించుకోవాలంటే.. మత్తు డాక్టరు లేరు. ఉన్న ఆ ఒక్క మత్తు డాక్టరు ఎప్పుడు అపాయింట్​మెంట్ ఇస్తే.. అప్పుడే శస్త్రచికిత్స, ప్రసవం చేయించుకోవాలి. ఇదీ.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి- రిమ్స్‌ పరిస్థితి.

rims
author img

By

Published : Jul 25, 2019, 6:40 PM IST

సమస్యల విలయంలో రిమ్స్‌

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైద్య కళాశాల అనుబంధంగా ఉన్న రిమ్స్‌... సమస్యల వలయంలో చిక్కుకుంది. రోజుకు 1800 మంది ఔట్‌ పేషంట్లు , 400మంది ఇన్‌పేషెంట్లు ఉండే ఈ ఆసుపత్రిని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా మత్తు వైద్యుల కొరత శస్త్రచికిత్సలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆసుపత్రిలో కనీసం 8మంది మత్తు వైద్యులు ఉండాలి. కానీ 4 పోస్టులే ఉన్నాయి. ఇందులో ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు. వీరిలో ఒకరు సెలవులో ఉన్నారు. మిగిలిన ఒక్కరే ఇంతమంది రోగులకు సేవలు అందించాల్సి వస్తోంది. మత్తు వైద్యుడు ఎప్పుడు సమయమిస్తే అప్పుడే ప్రసవాలు చేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గర్భిణీల సంఖ్య పెరుగుతున్నా.. తగిన మత్తు వైద్యులు, గైనికాలజిస్టులు లేక గుంటూరు ఆసుపత్రికి పంపించేస్తున్నారు. గుంటూరు వరకూ వెళ్లేందుకు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి మత్తు డాక్టర్‌ సమయం దొరికిందని కాన్పులను ఇచ్చిన తేదీకన్నా ముందే చేసేస్తున్నారు. ఇలాంటి కేసులు విఫలమై ప్రాణాలకు మీదకు వస్తోంది.

ఉలవపాడుకు చెందిన ఓ గర్భిణికి గురువారం ప్రసవ సమయం ఇచ్చారు. ఆ రోజుకు మత్తు డాక్టరు అందుబాటులో ఉండకపోవచ్చని.. సోమవారమే ప్రసవం చేసేశారు. ఆమె తీవ్ర అనారోగ్యం పాలై మంగళవారం మృతి చెందింది. ఈ విషయంపై బంధువులు ఆవేదన చెందారు. ఆందోళన చేశారు.

ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ వంటి అత్యవసరమైన పరికరాలు రెండేళ్లుగా పనిచేయడంలేదు. గత ఏడాది కొత్త స్కానర్‌ మంజూరైనా... గుత్తేదార్ల గొడవ కారణంగా అందుబాటులోకి రాలేదు. అంతేకాదు పలు పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదు. పెరుగుతున్న రోగులు సంఖ్యకు తగ్గట్టు పోస్టులు పెరగపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వైద్యులు అంటున్నారు. రిమ్స్ లో వెంటనే వైద్య ఖాళీలు భర్తీ చేసి.. పోస్టుల సంఖ్య పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రామాపురం మండలం బండపల్లి వద్ద వెలసిన ప్రేమాలయాన్ని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గురువారం సందర్శించారు అక్కడ వృద్ధాశ్రమం నిర్వహణ కడప జిల్లాలోని కరువు పరిస్థితులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని ని జయ ప్రకాష్ నారాయణ్ సత్కరించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ప్రధానమైన నా విద్య వైద్య వ్యవసాయం అవినీతి రహిత సమాజం స్థానిక సంస్థల బలోపేతం చట్టబద్ధ పాలన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై లోతైన అధ్యయనం చేపట్టామని తెలిపారు అందులో భాగంగా మొదటిసారి విద్యా యాత్రను ప్రారంభించామన్నారు ఈ రంగాలలో నిష్ణాతులు వాటి లోటుపాట్లను గుర్తించి మెరుగైన సేవలకు అవసరమైన నా నివేదిక రూపొందించి అనుభవజ్ఞుల ను ను రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఇ వారితో కలిసి పార్టీలకతీతంగా నవ సమాజ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రత్యేక మండలి గా ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు కు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆశ చూపి 7 వేల కోట్లు నిధులు ఇవ్వాల్సి ఉన్నా కేవలం 350 కోట్ల తోనే సరి పెట్టుకుందని చెప్పారు రాష్ట్రంలో లో అవినీతి రహిత పరిపాలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు దిగువ శ్రేణి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అవినీతి దూరం అయినప్పుడే సామాన్యుడికి సైతం అభివృద్ధి ఫలాలు దక్కుతాయి అన్నారు విద్యా యాత్ర పూర్తి కాగానే సమగ్రమైన నివేదికలను ఆయా రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు కార్యక్రమంలో విరామ ఎంఈ చిన్న రెడ్డన్న ప్రేమనే సిబ్బంది పాల్గొన్నారు

Body:బైట్స్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు

Conclusion:బైట్స్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.