ETV Bharat / state

రైతుల పాలిట గుదిబండగా మారిన మలబార్ వేప - కొనుగోలుదారులు కరవై మలబర్ వేప సేద్యందారులు నష్టాలపాలు

కల్ప వృక్షమని నమ్మిన మలబార్ వేప.. రైతుల పాలిట కల్ప వృక్షంగా మిగిలింది. సుబాబుల్, జామాయిల్, సరుగుడుకు ప్రత్యామ్నాయంగా.. ప్రకాశం జిల్లాలో సాగు చేసిన ఈ పంటకు కొనుగోలుదారుడు కరవయ్యాడు. రాయితీలు ప్రకటించి ప్రచారం చేసిన అధికారులు.. మార్కెట్ కల్పించే సమయానికి మొహం చాటేస్తున్నారు. లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఆశించిన రైతులు.. పెట్టుబడి ఖర్చులూ మిగలని అయోమయ స్థితిలో ఉన్నారు. ఏడేళ్లుగా తమ కష్టాన్ని ధారపోసి సాగుచేసిన వృక్షాలను.. ఉంచుకోలేక, తీసివేయడానికి మనసు రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

no market for malabar neem
మలబార్ వేప చెట్లు
author img

By

Published : Nov 14, 2020, 11:48 PM IST

ప్రకాశం జిల్లాలో సుబాబుల్, జామాయిల్, సరుగుడు పంటలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన మలబార్ వేప.. రైతులకు గుదిబండగా మారింది. ఏడేళ్ల వ్యవధిలో లక్షల రూపాయలు ఆదాయం ఇస్తుందని ప్రచారం చేసి తీసుకువచ్చిన పంటను.. కొనే నాథుడు కరవయ్యాడు. కోతకు సిద్దంగా ఉన్న చెట్లను తొలగించలేక, ఉంచుకోలేక పలువురు సతమతమవుతున్నారు. వందలాది ఎకరాలు సాగుచేయించిన అధికారులు.. మార్కెట్‌ కల్పించడానికి మొహం చాటేస్తున్నారు. ఒకటికి రెండు సార్లు రైతులను కలిసి, చైతన్య పరిచి వేయించిన పంట విషయంలో.. ఇప్పుడు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

రైతును నట్టేట ముంచిన మలబార్ వేప పంట

అధికారుల ప్రోద్భలంతోనే...

సుబాబుల్‌, జామాయిల్‌, సరుగుడు వేయడం వల్ల మార్కెట్‌ ఇబ్బందులు తప్పవని, గిట్టుబాటు ధర రాదని, భూగర్భ జలాలకు తీవ్ర నష్టమంటూ.. రైతులను అధికారులు ప్రత్యమ్నాయ పంటలవైపు మళ్లించారు. జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ద్వారా వాటర్‌ షెడ్ అమలు చేస్తున్న గ్రామాల్లో.. మలబబార్‌ వేపను ఏడేళ్ళ క్రితం పరిచయం చేశారు. అప్పటి డ్వామా అధికారులు గ్రామ గ్రామాన తిరిగి రైతుల్లో అవగాహన కల్పించారు. మలబార్‌ వేప వల్ల లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని నచ్చజెప్పారు.

ఈ పంట పండిస్తున్న కేరళ రాష్ట్రానికి కొంతమంది రైతులను తీసుకువెళ్ళి.. అక్కడ ఆర్జిస్తున్న లాభాలను ప్రత్యక్షంగా చూపించారు. ఎకరాకు 500 మొక్కలు నాటితే.. ఏడేళ్ల వ్యవధిలో టన్నుకు దాదాపు 10వేల రూపాయలు చొప్పున ఆదాయం లభిస్తుందని చెప్పారు. అధికారుల మాటలు ప్రకారం ఏడేళ్ళలో 10 లక్షల రూపాయలకు తక్కువ రాదు. ఈ ఆశతో రైతులు ఉత్సాహంగా ఆసక్తి చూపారు. జిల్లాలో దాదాపు 5 వేల ఎకరాలు సాగు చేసారు. పంట వేసిన రెండు సంవత్సరాలు అధికారులు పర్యవేక్షించారు కానీ తరువాత పట్టించుకోలేదు. వేసిన పంటను మధ్యలో తీయడానికి వీలు లేని పరిస్థితిలో రైతులు కొనసాగించారు. ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మలబార్ వేప కోతకు వచ్చినా.. పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు.

భారీ రాయితీలతో కొత్త ఆశలు:

ఏడేళ్ల క్రితం డ్వామా ద్వారా వాటర్‌ షెడ్‌ పథకంలో రైతులకు ప్రోత్సాహక రాయితీలు ప్రకటించారు. ఎకరాకు దాదాపు రూ. 50 వేల చొప్పున సాగు వ్యయంగా చూపించగా.. అందులోనూ చాలా వరకు రాయితీలిచ్చే విధంగా వివరించారు. చెరువులు, పొలాల గట్లు మీద పంట వేసే విధంగా చర్యలు చేపట్టారు. గట్లు మీద ఎకరాకు 160 చెట్లు, సాగు భూముల్లో 440 మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రచించారు. మొక్కకు రెండు రూపాయలు చొప్పున రాయితీ ఇచ్చారు. అప్పట్లో మంచి డిమాండ్‌ రావడంతో.. మొక్కకు రూ. 18 నుంచి రూ. 20 ఖర్చుపెట్టి రైతులు కొనుగోలు చేశారు. గోతులు తవ్వడానికి, మొక్క నాటడానికి మరో రూ.14 ఖర్చు కాగా.. ఒక్కోదానికి రూ. 30 వెచ్చించారు. ఈ గిరాకీని చూసి ఎర్రగొండపాలెంలో ఓ రైతు చేత నర్సరీని సైతం అధికారులు ఏర్పాటు చేయించారు. ఏడేళ్లలో ఎకరాకు రూ. 50 వేలు సాగు ఖర్చులు ఇస్తామన్న అధికారులు.. కేవలం రూ.14,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా డబ్బుల కోసం అడిగితే.. అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేశారు. రైతులకు విసుగొచ్చి అధికారులను ఆశ్రయించడం మానేశారు.

నష్టాల ఊబిలో సేద్యదారులు:

మలబార్ వేపలో 4 రకాలు ఉన్నా.. ఈ ప్రాంతానికి అనువుగా ఉంటుందని మిలియ దునియా రకం అధికంగా వేశారు. చెట్లకు సత్తువ కోసం పశువుల గెత్తం, రసాయన ఎరువులు వినియోగించారు. గత ఐదేళ్లుగా కరవు కారణంగా.. ట్యాంకర్లతో నీటిని తెప్పించి పంటను కాపాడుకున్నారు. ఈ విధంగా ఒక్కో ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పడు పంట కొనుగోలుదారులు లేరు. చెట్లు ముదురిపోతున్నాయని.. మార్కెట్‌ విషయంలో భరోసా లేకపోవడంతో అయోమయంలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. ఈ చెట్లను పొలంలో ఉంచే బదులు తొలగించి.. వేరే పంట వేసుకోవడం ఉత్తమమని కొంతమంది వాటిని విక్రయానికి పెడుతున్నారు.

టన్ను రూ.1,400 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలకు మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలోకి పాతుకుపోయిన వేళ్లు, దుంపలు తొలగించి.. నేలను బాగు చేసుకోడానికి మరో రూ.10వేల అదనపు ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. వేరే పంటలు సాగుచేసినా.. ఏడేళ్ళలో ఎంతో కొంత ఆదాయం వచ్చేదని ఆవేదన చెందుతున్నారు. కౌలుకు ఇచ్చినా ఏడాదికి రూ. 15 వేలు మిగిలేది కాగా.. ఇప్పుడు నష్టాలు మూటకట్టుకున్నామని వాపోతున్నారు. కొత్త పంట, మంచి ఆదాయం అని చెప్పి నమ్మించి.. అధికారులు వేయించిన పంటతో తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆశ..నిరాశల ఆరాటం..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.