ETV Bharat / state

నీట మునిగిన పొలాలు.. ప్రాణాలు కోల్పోయిన మూగజీవాలు

author img

By

Published : Nov 28, 2020, 9:46 AM IST

నివర్ తుపాను​తో ప్రకాశం జిల్లాలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. వర్షాల దాటికి గొర్రెలు మృత్యువాత పడాయి. దీంతో తాము లక్షల్లో నష్టపోయామని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

nivar cyclone effect
ప్రకాశంలో నివర్ ప్రభావం

నివర్ తుపాను కారణంగా ప్రకాశం జిల్లాలో పంటలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకు వచ్చిన పంటలతో పాటు.. లక్ష హెక్టార్లలో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొన్నారు. అరటి, బొప్పాయి వంటి ఉద్యాన తోటలు నేలకొరిగాయి. కంది, మినుము పంటలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. జిల్లావ్యాప్తంగా 902 గ్రామాలపై నివర్ తుపాను ప్రభావితం పడింది. 15 వేల హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. 20 వేల 714 హెక్టార్లలో మినుము, 13 వేల హెక్టార్లలో కంది, 14 వేల హెక్టార్లలో వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఏడు వేల హెక్టార్లలో పొగాకు పంట నీట మునిగి పాడయ్యిందని, మళ్లీ మరోసారి నాట్లు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని.. దీంతో అదనపు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

16 వేల హెక్టార్ల పత్తి పంట.. వర్షాల వల్ల రంగు మారి నాణ్యత కోల్పోవలసి వస్తుందని రైతులు పేర్కొన్నారు. 12 వేల ఎకరాల్లో చిరుధాన్యాలకు నష్టం వాటిల్లింది. ఇకపోతే గొర్రెల పెంపకందారులకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ముండ్లమూరు మండలంలో 30 గొర్రెలు వర్షాలకు తడిచి చనిపోయాయి. లక్షల రూపాయలు నష్టపోయినట్లు గొర్రెల పెంపకందారులు వాపోతున్నారు. రాజుపాలెంలో 12 గొర్రెలు, తాళ్లూరులో 12 దూడలు చలి కారణంగా మరణించాయి. జిల్లావ్యాప్తంగా తుపాను కారణంగా కలిగిన ఆర్ధిక నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఇవీ చూడండి...

నీటమునిగిన పంట...ఆగిన రైతు గుండె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.