ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్య పరిష్కారమయ్యే వరకు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పాల్గొనబోమని స్పష్టం చేశారు. మూడో దశలో భాగంగా ఈనెల 8న నామినేషన్లు దాఖలు చేసిన 9 మంది సర్పంచి, 8 మంది వార్డు అభ్యర్థులు గురువారం సాయంత్రం మూకుమ్మడిగా ఉపసంహరించుకున్నారు.
ఇక్కడి రైతులకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల భూములు జరుగుమల్లి మండలం గాడేవారిపల్లి కండ్రిక, కందుకూరు మండలం కోవూరు, జిల్లెళ్ల్లమూడి, కొండి కందుకూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నాయి. రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర అవసరాలకు వారు ఆయా గ్రామాల వీఆర్వోల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తమ భూములను ఒకే రెవెన్యూ గ్రామం పరిధిలోకి తెచ్చి హద్దులు నిర్ణయించాలని 2017 నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నా ప్రయోజనం లేకపోయింది. సమస్య పరిష్కారమయ్యేదాకా ఏ ఎన్నికల్లోనూ పాల్గొనబోమని పార్టీలకతీతంగా ప్రకటించారు.
ఇదీ చదవండి: