ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆటోనగర్ ఎరుకల కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. పోలా కోటేశ్వరరావు, పాలపర్తి చిన్న మధ్య సాయంత్రం సమయంలో చిన్నపాటి ఘర్షణ జరిగింది. అదికాస్తా పెద్దదై ఒకరినొకరు బరిసెలతో పొడుచుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో చిన్న... బరిసెతో కోటేశ్వరరావు గొంతులో పొడవుగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఇరువురు ఫూటుగా మద్యం తాగారని స్థానికులు తెలిపారు. వీరిద్దరు వరసకు అన్నదమ్ములే అని చెప్పారు స్థానికులు.
ఇదీ చూడండి