వివాహ వేడుకలో తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ వ్యక్తిని కాలితో గుండెలపై తన్నాడో భర్త. దాంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ముస్లిం బజారులో జెండా చెట్టు వద్ద (Murder in Prakasham district Darshi town) జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా బయటపడింది.
పోలీసులు తెలిపిన ప్రకారం..
దర్శి పట్టణం ముస్లిం బజారులోని జెండా చెట్టు సమీపంలో నిన్న రాత్రి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో బొమ్మనబోయిన పెద ఖాసిం అనే వ్యక్తి.. షేక్ మస్తాన్ వలి భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై భార్యాభర్తలు దాడి చేశారు. ఖాసింని మస్తాన్ వలి గుండెలపై బలంగా గుద్దటంతో ఖాసిం అక్కడికక్కడే కూలబడిపోయాడని స్థానికులు తెలిపారు. ఖాసిం కూలబడి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాసిం ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
ఖాసిం బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో ఖాసిం మృతదేహాన్ని పరిశీలించి.. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి: