రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి పథకాన్ని రేషన్ కార్డుతో ముడి పెట్టడంతో, ఆధార్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఒంగోలులో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రధాన తపాల పాలకార్యాలయంలోనే తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దర్శి మండలంలో ఉన్న 56 గ్రామాల ప్రజలు ఈ పోస్టాఫిస్ కు భారీగా తరలి వస్తున్నారు. ఆధార్‌కార్డులో తమ పిల్లల వేలిముద్రలను అనుసంధానం చేయించుకునేందుకు తల్లిదండ్రులు పిల్లలతో రావడంతో భారీ క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు వేకువ జామున నాలుగు గంటలకే పిల్లలను వెంటబెట్టుకొని వరుసలో నిలబడుతున్నారు. దీంతో రోజంతా పిల్లలతో ఆధార్ కేంద్రం వద్దే గడపాల్సి వస్తోందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితి పరిధిలో ఉన్న పోస్టాఫిసుల్లోనూ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: శ్రీశైలంలో 'వేలం' వివాదం... ఆలయ ఈవోపై బదిలీ వేటు