ఇవీ కూడా చదవండి....
చీరాల సీటును అధినేతకు కానుకగా ఇద్దాం! - prakasam
ప్రకాశం జిల్లా చీరాల అభ్యర్థి కరణం బలరాంను గెలిపించాలని.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తెలుగు మహిళ అధ్యక్షురాలు పోతుల సునీత. చీరాలలో తెదేపాను గెలిపించి అధినేత చంద్రబాబుకు కానుక ఇవ్వాలని అన్నారు.
కార్యకర్తల సమావేశంలో చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం
ప్రకాశం జిల్లా చీరాల అభ్యర్థి కరణం బలరామకృష్ణ మూర్తి తరఫున.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత.. కార్యకర్తలతో సమావేశమయ్యారు. చీరాలలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన భేటీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. చీరాలలో బలరాంను గెలిపించి అధినేత చంద్రబాబుకు కానుక ఇవ్వాలని సునీత కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చీరాల అంటేనే చైతన్యం అని, ఉద్యమాల పురిటి గడ్డ అని బలరాం చెప్పారు. విజయంపై దీమా వ్యక్తం చేశారు.
ఇవీ కూడా చదవండి....
sample description