ఒంగోలులో పోలీసుల తీరుపై తెదేపా ఎమ్మెల్యే బి. వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు ప్రణీత్ రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలను షేర్ చేసిన వ్యక్తులపై.. అక్రమంగా కేసులు పెట్టారన్నారు. అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహించారు. ఈ విషయంపై మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
నాయుడు పాలేనికి చెందిన సందీప్, చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేసి.. దేశ ద్రోహం, కుట్ర వంటి కేసులు పెట్టి బెయిల్ రాకుండా.. చేశారని ఆరోపించారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేశారన్నారు. కానీ.. వీరిద్దరూ కేవలం పోస్టులను షేర్ మాత్రమే చేశారని స్పష్టం చేశారు. చివరికి 3వ అదనపు మెసిస్టేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు.
తనను అక్రమంగా అరెస్ట్ చేసి.. రూరల్ పోలీసులు కొట్టారని బెయిల్ పై విడుదలైన సందీప్ పేర్కొన్నారు. మంత్రి బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డితో తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: