ఒంగోలు పాల డెయిరీని కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి తీసుకువచ్చి పూర్వ వైభవం కలిగిస్తామని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు అన్నారు. సంస్థ పాడిరైతులు, డైరీ ఉద్యోగులు సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులు మూలంగా డెయిరీ... 85 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించి.. ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: