ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఎమ్.మహిధర్ రెడ్డి అధికారుల తీరుపై గళమెత్తారు. తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతుంటే జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ నెల వచ్చినా ఇప్పటివరకూ తాగునీటి సమస్యపై ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని, తాగునీటి నిర్వహణపై గుత్తేదారులకు పనులు అప్పజెప్పడంలో జిల్లా పరిషత్తు అధికారులు బాధ్యతగా పనిచేయడంలేదని... అధికార పార్టి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ధ్వజమెత్తారు.
సోమవారం సాయంత్రం ఒంగోలు జడ్పీ కార్యాలయానికి వచ్చి, తన నియోజకవర్గంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులో అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని... తన నియోజకవర్గంలోనే ఎందుకిలా జరగుతుందంటూ జడ్పీ సిఈఓ కైలాస్ గిరేష్‌ను నిలదీశారు. అధికారులను కలవడానికి, కనీసం ఫోన్ చేద్దామని వచ్చినా... తీరకలేదని, వీడియో సమావేశాలు, సమీక్షా సమావేశాలు అంటూ తప్పించుకుంటున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
వేసవిలో నీటి సమస్యపై ప్రణాళికలు చేసుకోని పరిస్థితి జిల్లాలో తొలిసారిగా చూస్తున్నానని తెలిపారు. రాళ్లపాడు నుంచి నీటిని 90 గ్రామాలకు అందించే పథకం నిర్వహణను ఎవరికో గుత్తేదారుడికి ఇచ్చారని, అది ఇంతవరకూ నిర్వహణకే రాలేదన్నారు. సమస్యల తీవ్రతను గుర్తించి స్థానికులకు నిర్వహణ అప్పగిస్తే, వారికి బిల్లులు ఇవ్వడానికి అధికారలు తిప్పిస్తున్నారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి తాగునీటి అసరాలకోసం 100 కోట్లు మంజూరు చేస్తే, క్షేత్రస్థాయిలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేని పరిస్థితిలో జిల్లా అధికారులున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అధికారుల నుంచి సమాధానం వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు.
ఇదీ చదవండి