వ్యవసాయంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేట రైతు భరోసాకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా.. అగ్రవర్ణ కులాల్లో వెనుకబడిన వారికోసం ప్రత్యేక పథకం తీసుకురావడం సంతోషకరమన్నారు.
చీరాల ప్రాంతంలో ఎన్ఎల్ఆర్ 145 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని.. వెంటనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పలు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేకు రైతులు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి: 'ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ ఆశ్రయించవచ్చు'