మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని స్వగ్రామమైన తిమ్మసముద్రానికి వచ్చారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన హరిబాబుకు.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికా గార్గ్, గ్రామస్తులు స్వాగతం పలికారు. ఇటీవల హరిబాబు సోదరి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన బావ జయచంద్రకుమార్ ను పరామర్శించారు.
సాయంత్రం తిమ్మసముద్రం నుంచి బయలుదేరిన ఆయన.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలులో నివాసముంటున్న అత్తగారిని పలకరించేందుకు సతీసమేతంగా వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరారు. ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. మిజోరాం చిన్న రాష్ట్రమైనప్పటికీ.. ప్రకృతి రమణీయంగా ఉంటుందని, ప్రధాని మోదీ కూడా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.
ఇదీ చదవండి: