ETV Bharat / state

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - నూతలపాడు రైతు ఆత్మహత్య న్యూస్

అకాల వర్షాల కారణంగా చేతికందాల్సిన పంట నాశనం అయ్యింది. పంట సాగుకు తీసుకున్న అప్పు ఏవిధంగా తీర్చాలో సతమతమైన అన్నదాత... చావే శరణ్యం అనుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా నూతలపాడులో జరిగింది.

farmer suicide
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
author img

By

Published : Dec 21, 2020, 9:19 AM IST

అనుకోకుండా వచ్చిన వర్షాలతో పంట నష్టపోవటంతో మిరప రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో జరిగింది. గ్రామానికి చెందిన యర్రం సాంబిరెడ్డి, 5 ఎకరాల్లో మిరప పంట వేశాడు. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతింది. పంట కోసం చేసిన అప్పులు తీర్చలేనేమోనని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమినించిన కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

వృద్ధులే లక్ష్యంగా దోపిడీలకు రిమాండ్ ఖైదీల పథకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.