ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో 2,28,000 వేల గ్రామ వాలంటీర్లు , సచివాలయ వ్యవస్థలో 1,26,278 ఉద్యోగాలు కల్పించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు.
నవరత్నాలు కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేశారని, గ్రామ వాలంటీర్లు ప్రతి నెల వృద్ధులకు, వికలాంగులకు విధిగా ఫించన్లు అందిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతోందన్నారు. అనంతరం వాలంటీర్లకు సేవరత్న, సేవవజ్ర, సేవమిత్ర పురస్కారాలు అందించారు.
ఇదీ చదవండి: మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా: సీఎం జగన్