జగనన్న కాలనీలు ఆధునిక హంగులు, మౌలిక సదుపాయాలతో టౌన్షిప్ కాలనీలుగా అభివృద్ధి కానున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో జగనన్న కాలనీలలో గృహాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. నిలువ నీడ లేని నిరుపేదలకు సొంత గూడు కల్పించటం కోసం ముఖ్యమంత్రి జగన్.. జగనన్న కాలనీలు నిర్మిస్తున్నారన్నారు.
ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ నిరంతరం సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలతో రాష్ట్ర పరిపాలన వ్యవస్థను ప్రజల ఇంటి గడప వద్దకు తెచ్చామన్నారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకతీతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇదీచదవండి