ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. గుంటూరులోని తన నివాసం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, తాహసీల్దార్ లు, ఎస్సైలు, సీఐ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మార్కాపురం ఆర్డీఓ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. వర్షాకాలం కూడా ప్రారంభం కావడంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కరోనా ప్రభావం ఇంకా అధికమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారుల పనితీరుపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: