ETV Bharat / state

'అన్ని పంటలు ఈ-ప్రొక్యూర్​మెంట్ పరిధిలోకి తెస్తాం' - పొగాకు కొనుగోళ్లపై మంత్రి కన్నబాబు కామెంట్స్

వ్యవసాయ ఉత్పత్తులకు దళారీలు , మధ్యవర్తుల బెడద లేకుండా గిట్టుబాటు ధర అందించేందుకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అన్ని పంటలకూ ఈ విధానాన్ని అమలుచేస్తామన్న ఆయన... రైతులు పంటను నేరుగా విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు.

మంత్రి కురసాల కన్నబాబు
మంత్రి కురసాల కన్నబాబు
author img

By

Published : Jul 2, 2020, 5:57 PM IST

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం పేర్నమెట్టలో 'నూతన సాగు విధానంపై చర్చించుకుందాం' అంశంపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రులు బాలినేని శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి... రైతులకు ప్రయోజనం చేకూరే ఈ కార్యక్రమాన్నైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

లాక్​డౌన్‌ కారణంగా పొగాకు రైతులకు పంట అమ్ముకోడాని ఇబ్బందులు తలెత్తాయి. పొగాకు రైతుల ఇబ్బందులు తొలగించడానికి రాష్ట్రంలో తొలిసారిగా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నాం. దశలవారీగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ ద్వారా వ్యాపారం సాగిస్తాం. ప్రతీ ఏటా కొనుగోళ్లు చేపడతాం. దీంతో గ్రేడ్‌ పొగాకుకు మార్కెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ---- కురసాల కన్నబాబు , వ్యవసాయశాఖ మంత్రి

తొమ్మిది గంటల పాటు విద్యుత్

విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీని పరిస్థితిలో రైతులు ఉండేవారన్నారు. రైతులు రాత్రి పూట పొలాల్లో పడిగాపులు కాసేవారన్నారు. వైకాపా ప్రభుత్వం పగటి పూట 9 గంటలపాటు రైతులు విద్యుత్ అందిస్తుందని స్పష్టం చేశారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​, పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎస్.ఎన్.పాడు ఎమ్మెల్యే సుధాకర్​బాబు కార్యక్రమంలో ప్రసంగించారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, వాటిని రైతులు ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాలపై అధికారులు రైతులకు వివరించారు.

ఇదీ చదవండి : పన్ను చెల్లింపునకు అడ్డంకులు... నెరవేరని రెవిన్యూ లక్ష్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.