ETV Bharat / state

ఏ సీఎం పంపిణీ చేయని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ - మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తాజా వార్తలు

దేశంలో ఏ సీఎం చేయని విధంగా జగన్​.. 30 లక్షల ఇళ్ల పట్టాలను​ అందించడం సువర్ణాధ్యాయమని.. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మార్టూరులో శుక్రవారం రాత్రి 536 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.

Minister Balineni Srinivasa Reddy at the Navratnas pedhalandhariki illu program organized in Prakasam district
ఏ ముఖ్యమంత్రి పంపిణీ చేయని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ..
author img

By

Published : Dec 26, 2020, 1:07 PM IST

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని, మార్టూరులో 536 మంది లబ్ధిదారులకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమపథకాలను అందిస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రతీ ఒక్క నిరుపేదకు సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో.. ఈ పథకాన్ని నవరత్నాల్లో పొందుపరచామన్నారు. నేడు పేదల సొంతింటి కల నేరవేర్చేందుకు వైఎస్ఆర్, జగనన్న కాలనీల పేరుతో అర్హులైన పేదలందరికి పట్టాలు పంపిణీతోపాటు.. గృహానిర్మాణాలు చేసి అందిస్తున్నామని చెప్పారు.

దేశంలో ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను​ జగన్​ అందించడం సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. అటువంటి సీఎంను ప్రజలు గుండెల్లో నిలుపుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా అని బాలినేని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, వైకాపా నేత రావి రామనాథంబాబు, ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రేమ, పెళ్లి అన్నాడు... అనుమానంతో హతమార్చాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.