ETV Bharat / state

రైతులు ఒక్క రూపాయి చెల్లించినా.. రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని - ఉచిత విద్యుత్​పై మంత్రి బాలినేని కామెంట్స్

రైతులకు ఉచిత విద్యుత్‌పై మంత్రి బాలినేని స్పందించారు. రాష్ట్రంలో రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. సంస్కరణల్లో భాగంగానే.. ఈ నిర్ణయమని స్పష్టం చేశారు.

minister balineni on free current
minister balineni on free current
author img

By

Published : Sep 2, 2020, 5:17 PM IST

Updated : Sep 2, 2020, 8:24 PM IST

కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపునకే మీటర్లు​ పెడుతున్నామని మంత్రి బాలినేని తెలిపారు. విద్యుత్ నగదు బదిలీతో రైతులపై ఒక్క రూపాయి భారం మోపబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని... ఒకవేళ రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినా.. విద్యుత్‌ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీ చేయబోతున్నట్లు చెప్పారు.

రైతులు ఒక్క రూపాయి చెల్లించినా.. రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని

కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఒంగోలు రిమ్స్ లో కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో వచ్చిన ఆరోపణలు మళ్లీ వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశానికి మంత్రి బాలినేనితోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్, జేసి చేతన్ హాజరయ్యారు.

రాజన్న బాటలోనే... ఆయన తనయుడు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగొలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. దివంగత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు వైఎస్​ఆర్​ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని... రాజన్న బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్​ పేదప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మంత్రి బాలినేని అన్నారు.

ఇదీ చదవండి: దేవరాపల్లి పీఎస్​ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

Last Updated : Sep 2, 2020, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.