ప్రకాశం జిల్లాలో 90శాతం పంచాయతీ స్థానాలను వైకాపా గెలుచుకుంటుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైకాపా జిల్లా కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై ముఖ్య నాయకులతో సమాలోచనలు చేశారు. జిల్లా పార్టీ పర్యవేక్షకులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సమక్షంలో ఆదిమూలపు సురేష్, జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లతో సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ పట్ల, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల ప్రజల్లో మంచి పేరుందని.. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు