రాష్ట్రంలో త్వరలోనే నూతన విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ లోపు సమయం వృథా చేయకుండా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ఏ విధంగా నిర్వహించాలనే దానిపై విధి విధానాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటించారు. సీఎం సహాయ నిధి కింద 59 మంది లబ్దిదారులకు సుమారు రూ.19 లక్షల విలువైన చెక్కులు అందించారు.
కరోనాతో ఇబ్బందులున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు. కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టామన్న మంత్రి.. రాష్ట్రంలో దాదాపు 11 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. నాడు - నేడు కార్యక్రమం కింద పాఠశాలలు తెరిచే లోపు పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:
సింహాచలం గోశాలలో పాతవారినే నియమించాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశం