ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో రహదారి విస్తరణలో భాగంగా అద్దంకి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కట్టడాల తొలగింపు చేపట్టారు. అధికారులు చెప్పిన కొలతల కంటే ఎక్కువగా తొలగింపు చేపడుతున్నారని వ్యాపారులు ఆ పనులను అడ్డుకున్నారు. కమిషనర్ ఫజలుల్లా, ఎస్సై మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని వ్యాపారస్థులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి: పర్యాటక శోభ సంతరించుకోనున్న కనిగిరి దుర్గం దొరువు