ప్రకాశంజిల్లా దర్శి మండలం జముకులదిన్నెలో చెరువులోని మట్టిని అనుమతులులేకుండా రైల్వేకాంట్రాక్టు పనులకు తరలించడాన్ని రెవెన్యూ సిబ్బంది నిలుపుదల చేశారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను పనులకు చెరువు పూడిక మట్టిని వాడుతున్నారు. గ్రామస్థులకుగాని, గ్రామపంచాయతీ గాని సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టరు మట్టిని రెండు రోజులుగా తవ్వుతున్నాడు. ఎవరైనా అడిగితే కేంద్రప్రభుత్వ పనికి వాడుతున్నామని తెలిపాడు. స్థానికులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెరువు వద్దకు వెళ్ళి అనుమతులు లేకుండా మట్టిని తవ్వకూడదనిని వాహనాలను నిలుపుదల చేశారు. గ్రామస్థుల్లో ఒక వర్గం వారుమాత్రం చెరువు బాగుపడుతుందని.. అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అధికారులు మాత్రం అనుమతులు తీసుకొని తవ్వుకోవలసిందిగా తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి.