నెలల తరబడి దిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం దారుణమని అఖిలభారత రైతుసంఘం నాయకులు అన్నారు. దిల్లీ రైతుల ఆందోళనలకు మద్దతుగా ప్రకాశం జిల్లా మార్టూరు, ఇంకొల్లులో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అధిక సంఖ్యలో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో అన్నదాతలు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో రాంనగర్ మార్కెట్ యార్డ్ నుంచి భవాని కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. రైతులు కార్పొరేట్ సంస్థల చేతికి చిక్కితే ఏ విధంగా ఉంటుందో అర్థమయ్యేలా నాటికను ప్రదర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే... కేంద్రం పట్టించుకోకపోవటం శోచనీయమని అఖిలభారత రైతుసంఘం నాయకులు విమర్శించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఇవీ చదవండి: బాలమ్మకు చేయూత.. రెండు ఆవులు పంపిన ఇద్దరు ప్రవాసాంధ్రులు