ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మన్నెంవారిపల్లెలో చిన్నపాటి వర్షం కురిసిన నీరు నిలిచి బరుదమయంగా మారుతుంది. దీంతో నీటిపై దోమలు చేరి వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామానికి చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా ఫోటోలు తీసి ఎమ్మెల్యే నాగర్జున రెడ్డికి పంపాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ...ఎంపీడీవో హనుమంతురావుకు సమస్య వివరించి... పరిష్కరించాలని సూచించారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి గ్రామానికి చేరుకొని రహదారికి ఇరువైపుల కాలువలు తీయించారు. దీంతో ఎన్నో నెలల నుంచి ఉన్న పరిష్కారం కావటంతో గ్రామస్తులు..ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి